భీమా..
పూరి గుడిసెల పాటగూడ
కుమురం భీం ప్రతిమ
పెద్దపట్నాపూర్: 25 కుటుంబాల్లో 183 మంది జనాభా ఉన్నారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు వచ్చిన రోజు ఇబ్బంది ఉండదు. రానిరోజు ఇబ్బంది తప్పదు. 18 మందికి పీఎం జన్మన్ గృహాలు మంజూరయ్యాయి.
పాటగూడ: అంతర్జాతీయంగా పేరుగాంచిన గ్రామం. కానుగ విత్తనాలతో విద్యుత్ తయారుచేసి అందరి దృష్టిని ఆకర్షించారు. 43 కు టుంబాల్లో 220 మంది జనాభా ఉన్నారు. చే తిపంపు చెడిపోతే బావినీరే దిక్కు. ఆర్వో ఎ ఫ్ఆర్ పట్టాలు అందలేదు. ఇద్దరికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి.
టోకెన్మోవాడ్: 20 కుటుంబాల్లో 96 మంది జనాభా ఉన్నారు. కొందరికి పట్టాలు లేకపోవడంతో రైతుబంధు రావడం లేదు. బ్యాంకు రుణాలు అందడం లేదు. గ్రామంలో ఒక్కరికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. పీఎం జన్మన్ పథకం కింద 10 మందికి ఇళ్లు మంజూరయ్యాయి.


