చంద్రబాబు కనుసైగల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కనుసైగల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం

Oct 24 2026 11:47 PM | Updated on Oct 24 2026 11:47 PM

● ఆదిలాబాద్‌ జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు భార్గవ్‌ దేశ్‌పాండే

లక్డీకాపూల్‌: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు కనుసైగల్లో.. రాక్షస పాలనను కొనసాగిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఆదిలాబాద్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు భార్గవ్‌ దేశ్‌పాండే తీవ్రంగా విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని చూసి ఆనాడు కాంగ్రెస్‌ పార్టీకి ఆకర్షితుడినయ్యానని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పాలకులు అవినీతి, అక్రమాలతో బిల్డర్లు, వ్యాపారస్తులు, మిల్లర్లతో పాటు హైడ్రా కూల్చివేతలతో పేదల ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా రాహుల్‌ గాంధీ... ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే, తెలంగాణలో అందుకు భిన్నంగా ఉండటాన్ని ప్రశ్నించాలన్నారు. అవినీతి, కుంభకోణాలకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై పారదర్శక విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. డైరెక్షన్‌ లెస్‌ సీఎం.. సెన్స్‌లెస్‌ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తు అంధకారమేనన్నారు. ఆదిలాబాద్‌ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ యువత ఆకాంక్షలు, తన వెంట నిలిచిన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సమస్యలపై పోరాటం కోసం కేసీఆర్‌ నాయకత్వంలో పని చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement