ఆన్‌లైన్‌ లారీ బుకింగ్‌ పేరుతో భారీ మోసం | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ లారీ బుకింగ్‌ పేరుతో భారీ మోసం

Oct 24 2026 11:47 PM | Updated on Oct 24 2026 11:47 PM

● 40 టన్నుల మొక్కజొన్నలు మాయం ● ఇద్దరు నిందితుల అరెస్ట్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా లారీ బుక్‌ చేసుకుని మొక్కజొన్నల లోడ్‌ను దారి మళ్లించి విక్రయించిన ఇద్దరు నిందితులను శనివారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. హర్యానాకు చెందిన లారీ యజమాని రషీద్‌, రాజస్థాన్‌కు చెందిన డ్రైవర్‌ షౌకత్‌ ఖాన్‌ బ్లాక్‌ బక్‌ అనే యాప్‌ ద్వారా లారీ కిరాయిలు పొందుతున్నారు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తప్పుడు నంబర్‌ ప్లేట్‌, నకిలీ పత్రాలతో మోసానికి పథకం వేశారు. ఈనెల 7న జైనథ్‌ నుంచి కర్ణాటకకు 40,435 కిలోల మొక్కజొన్నల రవాణాకు బుకింగ్‌ తీసుకుని, బాధితుడు రోహిత్‌ షిండే నుంచి ఫోన్‌పే ద్వారా రూ.50 వేలు అడ్వాన్స్‌ తీసుకున్నారు. తర్వాత సరుకును కర్ణాటకకు తరలించకుండా నాగ్‌పూర్‌ మీదుగా మధ్యప్రదేశ్‌కు తీసుకెళ్లి విక్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసి పరారీలో ఉన్న నిందితులను సాంకేతిక ఆధారాలతో మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో పట్టుకున్నారు. లారీ, నకిలీ పత్రాలు, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement