భైంసాటౌన్: భైంసా సబ్ డివిజన్ పరిధిలోని పలు ఆలయాలు, ఇళ్లలో చోరీ కేసులకు సంబంధించి సొత్తును రికవరీ చేసినట్లు ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత జూన్, ఆగస్టు నెలల్లో భైంసా మండలంలోని బిజ్జూర్, పెండ్‌పల్లి, దేగాం, తిమ్మాపూర్, హంపోలి(కె), లోకేశ్వరం మండలంలోని రాయపూర్ కాండ్లి, మన్మద్, నర్సాపూర్(జి), దిలావర్‌పూర్ గ్రామాల్లోని పలు ఆలయాలు, ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడిన ముధోల్ మండలం ఎడ్‌బిడ్ గ్రామానికి చెందిన అర్సల పెద్ద సాయన్న, బ్రాహ్మణ్‌గావ్‌కు చెందిన సంగోల్ల భూమేశ్, బుడుబుక్కల గంగన్న, నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కంఠంకు చెందిన బైరూపుల పండరి, బైరూపుల కుమార్‌ను ఆగస్టు 22న వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. గతనెల 14న తిరిగి పోలీసు కస్టడికి తీసుకుని వారి వద్ద నుంచి 170 గ్రాముల వెండి, 13 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.22వేల నగదు రికవరీ చేసినట్లు వెల్లడించారు. వరుస చోరీ కేసుల ఛేదనలోకృషి చేసిన రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై సుప్రియను ఎస్పీ జానకీషర్మిల అభినందించినట్లు పేర్కొన్నారు.


