బోథ్: కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సంపాదించిన బోథ్‌కు చెందిన పేద విద్యార్థి సాయిచరణ్‌కు అవసరమైన వైద్య పరికరాలు, సామగ్రిని మునిగెల మహేందర్ అందించారు. సాయిచరణ్‌కు వైద్య విద్యలో అవసరమయ్యే అప్రాన్, స్టెతస్కోప్, డిసెక్టింగ్ కిట్, లాన్సెట్లు, నీ హ్యామర్, పెన్ టార్చ్, మెజరింగ్ టేప్, హెచ్అండ్ఈ పెన్సిల్, గ్లౌజులు, సర్జికల్ మాస్కులు వంటి పరికరాలు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో మునిగెల మహేందర్ విద్యార్థికి అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు తోడ్పడటం, వారి చదువుకు అవసరమైన సహాయం అందించడం సమాజంలోని ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.


