ఆదిలాబాద్(బేల): బేల మండలం చప్రా ల గ్రామానికి చెందిన బోల్గోడ్ గజానన్ (26) గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు, ఎస్సై మధుకృష్ణ తెలిపిన వివరాల ప్రకా రం.. చప్రాలకు చెందిన గజానన్, అదే గ్రామానికి చెందిన పాయల్ సాయికి చెందిన బొలెరో పికప్ వాహనంలో డోప్టాల గ్రామానికి చెందిన రాజు సోయాబీన్ పంటను మహారాష్ట్రలోని వణికి తరలించారు. పంటను అక్కడ అన్లోడింగ్ చేసి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి 12గంటల సమయంలో కొబ్బాయి గ్రామం దాటిన తర్వాత పాయ ల్ సాయి అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహ నం నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గజానన్, పాయల్ సాయికి తీవ్ర గా యాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు 108 అంబులెన్స్‌లో వారిని ఆది లాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గజానన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ని ర్ధారించారు. తీవ్రంగా గాయపడిన పాయల్ సాయి ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


