వ్యవసాయ బావిలో పడి వివాహిత.. | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ బావిలో పడి వివాహిత..

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

నేరడిగొండ: మండలంలోని రోల్‌మామడ గ్రామానికి చెందిన గేడం కమలాబాయి (35) వ్యవసాయ బావిలో పడి మృతిచెందింది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆమె మృతదేహం శుక్రవారం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాబాయి బుధవారం వ్యవసాయ పనుల నిమిత్తం చేనుకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రెండు రోజుల పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై ఇమ్రాన్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త మాణిక్‌రావు, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement