ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని తిరుమల వైన్స్ షాపు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం రాత్రి లభ్యమైందని వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్‌లోని మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
సారంగపూర్: మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూరు గ్రామానికి చెందిన చందల సాయినాథ్, దేశెట్టి శ్రీనివాస్ మండలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయం వద్ద శుక్రవారం ఓ కుల సంఘం చేసిన పండుగకు హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. జామ్ గ్రామానికి చేరుకోగానే స్పీడ్ బ్రేకర్ వద్ద వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాయినాథ్, శ్రీనివాస్‌కు తల, ముఖం, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని 108 అంబులెన్స్‌లో నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని ఈఎంటీ సాగర్, పైలెట్ మల్లేశ్ తెలిపారు.
బైక్ ఢీకొని ఒకరికి గాయాలు
ఖానాపూర్: పట్టణంలోని విద్యానగర్ పెట్రోల్ బంక్ సమీపంలో ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనదారుడు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో చిన్న మల్లేశ్ అనే వ్యక్తి కాలుకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు.


