ఆదిలాబాద్‌టౌన్: యూనిక్ మర్చంటైల్ ఇండియా లిమిటెడ్, యూనిక్ ఎస్‌ఎంసీఎస్ సంస్థల పేరుతో అధిక లాభాల ఆశ చూపి పెట్టుబడులు, చిట్‌ఫండ్ల ద్వారా ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చే సిన కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ రా య్‌ను జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలి సిందే. ఈ నేపథ్యంలో నల్గొండ, సూర్యాపేట, నిజా మాబాద్, మెదక్, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాలకు చెందిన సుమారు 150 మంది బాధితులు గురువారం రాత్రి ఆదిలాబాద్‌కు చేరుకుని ఎస్పీ అఖిల్ మహాజన్‌ను శాలువాతో సన్మానించారు. నిందితుడి అరెస్ట్‌తో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ప్రధాన నిందితుడి అరెస్ట్‌పై హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా సుమారు 10వేల మంది డబ్బులు పెట్టి నష్టపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ బాధితులున్నట్లు సమాచారం. పెట్టుబడుల గడువు ముగిసినా డబ్బులు తిరిగి అందక పలువురు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల నుంచి సేకరించిన డబ్బులు, సంస్థల ఆర్థిక లావాదేవీలు, నిందితులకు సంబంధించిన ఆస్తులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇతరుల పాత్ర, బాధితుల సంఖ్య, పెట్టుబడి మొత్తాలపై వివరాలు సేకరిస్తున్నారు. సేకరించిన నిధులతో నిందితుడు వివిధ రాష్ట్రాల్లో ఫైవ్‌స్టార్ హోటళ్లు, హైదరాబాద్‌లో 400 ప్లాట్లు, 200 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాటిని కోర్టు ద్వారా జప్తు చేయించేలా నివేదికలు పంపనున్నట్లు పేర్కొన్నారు. మోసానికి గురైనవారు ధైర్యంగా ముందుకువచ్చి సంబంధిత పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.


