కిడ్నాప్‌ చేసినవారిపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ చేసినవారిపై చర్యలు తీసుకోవాలి

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

లక్సెట్టిపేట: ఆర్టీఏ మెంబర్‌ అంకతి శ్రీనివాస్‌ను కిడ్నాప్‌ చేసిన వ్యక్తులపై కఠినచర్యలు తీసుకోవాలని మంచిర్యాల నగర మేయర్‌ ధరణి మధుకర్‌ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐబీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. స్నేహం పేరిట కొందరు దసరా రోజు శ్రీనివాస్‌కు మద్యం తాగించి కిడ్నాప్‌ చేశారని తెలిపారు. ఈ సమాచారం ఎమ్మెల్యేకు తెలవడంతో వెంటనే స్పందించి శ్రీనివాస్‌ను రక్షించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్‌ కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో కొనసాగుతాడని పేర్కొన్నారు. అనంతరం గాంధీ చౌక్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్లి సీఐ రమణమూర్తి, ఎస్సై సురేశ్‌కు ఫిర్యాదు చేశారు. తనను కిడ్నాప్‌ చేసిన వ్యక్తులపై కఠినచర్యలు తీసుకోవాలని శ్రీనివాస్‌ ఫిర్యాదులో కోరారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌ నాగభూషణం, నాయకులు గడ్డం త్రిమూర్తి, నలిమెల రాజు, వెంకటస్వామిగౌడ్‌, సత్యపాల్‌, నర్సయ్య తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement