ఆదిలాబాద్‌రూరల్: బడుగు, బలహీన వర్గాల అణ చివేతకు వ్యతిరేకంగా పోరాడిన పండుగ సాయన్నను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల పరిరక్షణకు పాటుపడిన గొప్ప నేత అని కొనియాడారు. సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూషా, తదితరులు పాల్గొన్నారు.
ధైర్యసాహసాలకు ప్రతీక..
ఆదిలాబాద్‌టౌన్: పండుగ సాయన్న జీవితం సమానత్వం, ధైర్యసాహసాలకు ప్రతీక అని జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.మౌనిక అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో సాయన్నకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన ప్రజావీరుడిగా ఆయన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ డి.వెంకటి, సీఐ నైలు, పోలీసు కార్యాలయ సూపరింటెండెంట్ సులోచన, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


