పాత గెజిట్‌ ప్రకారమే రైల్వేలైన్‌ నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

పాత గెజిట్‌ ప్రకారమే రైల్వేలైన్‌ నిర్మించాలి

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

ఆదిలాబాద్‌(బేల): పాత గెజిట్‌ ప్రకారమే రైల్వేలైన్‌ నిర్మించాలని యువజన కాంగ్రెస్‌ ఆదిలాబాద్‌ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. గడ్చందూర్‌ నుంచి జైనథ్‌, బేల మీదుగా ఆదిలాబాద్‌ వరకు రైల్వేలైన్‌ నిర్మించాలని కోరుతూ గురువారం బేల మండలం ఖోగ్ధూర్‌లో పోస్ట్‌కార్డుల ఉద్యమం చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి పోస్ట్‌కార్డులు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత గెజిట్‌ ప్రకారం రైల్వే లైన్‌ నిర్మిస్తే పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో సులభమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ బేల మండల అధ్యక్షుడు కన్య రాజు, తేజరావు, దత్త చేవాన్‌, రమేశ్‌, షేక్‌ అసేన్‌, భాస్కర్‌, సోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement