ఆశా వర్కర్ల సేవలు గుర్తించని ప్రభుత్వాలు | - | Sakshi
Sakshi News home page

ఆశా వర్కర్ల సేవలు గుర్తించని ప్రభుత్వాలు

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

ఆదిలాబాద్‌టౌన్‌: ఆశా వర్కర్ల సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారంతో పాటు పెండింగ్‌ బిల్లుల విడుదల కోసం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే మహా ధర్నాలో ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలు పునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూ నియన్‌ అధ్యక్షురాలు సుజాత, స్వప్న, లత, లలిత, నాజియ, మాధవి, కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement