కైలాస్‌నగర్: జనాభా గణన పారదర్శకంగా చేపట్టాలని కలెక్టరేట్ సూపరింటెండెంట్ నలందప్రియ అన్నారు. జనాభా గణన–2027ను వి జయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సి న విధివిధానాలపై మండల ఛార్జ్ అధికారులు, అదనపు ఛార్జ్ అధికారులకు గురువారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈసారి జనాభా గణన వివరాలను మా న్యువల్ విధానంతో పాటు డిజిటల్ యాప్‌లో కూడా నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. సమాచార సేకరణ, నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సంబంధిత సిబ్బందికి స్పష్టమైన సూచనలు అందించాలని అధికారులకు సూచించారు. రిటైర్డ్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కోట కృష్ణయ్య, హైదరాబాద్ డీసీఓ కార్యాలయానికి చెందిన డీపీఏ, మాస్టర్ ట్రైనర్ డి.వెంకటరమణ శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జగదీశ్వరరావు, తహసీల్దా ర్లు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.


