అదుపుతప్పిన ద్విచక్రవాహనం | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పిన ద్విచక్రవాహనం

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

● భార్యాభర్తలకు గాయాలు

బాసర: బాసర రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఫ్లైఓవర్‌ గల స్పీడ్‌బ్రేకర్‌ వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పిన ఘటనలో భార్యాభర్తలకు గాయాలయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా గుండారం గ్రామానికి చెందిన భార్యభర్తలు ద్విచక్రవాహనంపై పని నిమిత్తం గురువారం బాసరకు వచ్చారు. మధ్యాహ్నం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో స్పీడ్‌ బ్రేకర్‌ ఎత్తుగా ఉండడంతో అదుపుతప్పింది. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని బాసర పోలీసులు అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఫ్లైఓవర్‌ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement