సంప్రదాయాలను భావితరాలకు అందించాలి | - | Sakshi
Sakshi News home page

సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

ఇంద్రవెల్లి: మెస్రం వంశీయుల తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందనిన నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్‌, వంశం పెద్దలు చిన్నుపటేల్‌, కోసేరావ్‌, వంశం ఉద్యోగ సంఘం వంశీయులు దేవ్‌రావ్‌, శేఖర్‌బాబు పేర్కొన్నారు. మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా ఆలయంలో దసరా పూజల అనంతరం హాజరైన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మెస్రం వంశీయులతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగోబా ఆలయ అభివృద్ధికి వంశీయులంతా కృషి చేయాలన్నారు. నాగోబా పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్య సదుపాయాలు కల్పించేందుకు తమవంతు సహకారం అందించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement