బోథ్: మండలంలోని బాబెరతాండ పంచా యతీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్‌తో బ్యాటరీ, ఇంట ర్నెట్ వైర్లు దగ్ధమయ్యాయి. మంటలకు కా లిపోగా నష్టం వాటిల్లింది. సర్పంచ్ రూప్ చంద్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.
ప్రభుత్వ ఉద్యోగం
ఇప్పిస్తానని మోసం
ఆదిలాబాద్‌టౌన్: విద్యుత్‌శాఖలో జూనియర్ లైన్‌మన్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగి తండ్రి నుంచి రూ.6 లక్షలు వసూలు చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. గురువారం వన్‌టౌన్‌లో వివరాలు వెల్లడించారు. బోథ్ మండలం సోనాల గ్రామానికి చెందిన బాధితుడు బోయినపల్లి నర్సయ్యకు నాలుగేళ్ల క్రితం ఆదిలాబాద్‌లోని శాంతినగర్‌కు చెందిన నిందితుడు రాజేందర్‌తో పరిచయం ఏర్పడింది. తన కుమారుడికి విద్యుత్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. రూ.10 లక్షలు అవసరమవుతాయని చెప్పి బాధితుడి నుంచి రూ.6 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా, తీసుకున్న డబ్బుల్లో రూ.1.27 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చాడు. మిగతా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ప్రేమ పేరుతో వేధింపులు..
యువకుడి రిమాండ్
ఆదిలాబాద్‌టౌన్: ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురిచేసిన యువకుడిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన రాథోడ్ అజయ్ గత కొంత కాలంగా ఓ యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో వేధింపులు భరించలేక బాధితురాలి పోలీసులకు ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.
మహిళ పర్సు చోరీ
నిందితుడు..
ఆదిలాబాద్‌టౌన్: మహిళ పర్సు చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన షేక్ షబాన ఇటీవల పట్టణంలోని అ ర్ఫా గార్డెన్‌లో శుభకార్యానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆమె పక్కన పెట్టిన పర్సును మహాలక్ష్మివాడకు చెందిన షకీల్ దొంగిలించాడు. అందులో రెండు గ్రాముల బంగారం, మూడు తులాల వెండి ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.


