లక్ష్మణచాంద: సోన్ మండలం కడ్తాల్ గ్రా మంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దంపతులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ గురుస్వామి నర్సారెడ్డి చేతుల మీదుగా ఎమ్మెల్యే చిన్న కుమారుడు అర్జున్ జాదవ్ అయ్యప్ప మాలధారణ స్వీకరించా రు. తన కుటుంబంతోపాటు బోథ్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రా ర్థించారు. గురుస్వాములు ప్రభాకర్‌రెడ్డి, శో భన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సైబర్ వలలో పైవేట్ ఉద్యోగి
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ వలలో పడి ప్రైవేట్ ఉద్యోగి మోసపోయిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..పట్టణానికి చెందిన వినీత్‌కుమార్ తన ఫోన్‌కు గతనెల 21న లింక్ వచ్చింది. ఓపెన్ చేయడంతో పార్ట్‌టైం జాబ్‌తోపాటు వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఇంటి వద్ద ఉంటూ సంపాదించవచ్చని అందులో ఉంది. బాధితుడు మొదట రూ.8 వేలు పంపించాడు. రెండు, మూడురోజుల తర్వాత రూ.14 వేలు వచ్చా యి. ఇలా రెండు, మూడుసార్లు డబ్బులు పంపడంతో కొంత ఆదాయం వచ్చింది. దీంతో పలు అకౌంట్ల ద్వారా రూ.9 లక్షలు పంపించాడు. గతనెల 22 నుంచి 29 వరకు పెట్టుబడి పెట్టాడు. డబ్బులు రాకపోవడంతో వారి కి ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించి బాధితుడు వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సునీల్ కుమార్ తెలిపారు.


