దుర్గాదేవి నిమజ్జనంలో కేసీఆర్‌ చిత్రపటాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గాదేవి నిమజ్జనంలో కేసీఆర్‌ చిత్రపటాలు

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

ఇచ్చోడ: మండలంలోని ముఖరా(కే) గ్రామంలో దుర్గాదేవి నిమజ్జనంలో గ్రామస్తులు కేసీఆర్‌ చిత్రపటాలతో పాల్గొన్నారు. మాజీ సర్పంచ్‌ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్‌ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. మళ్లీ సారే కావాలంటున్నారు.. మళ్లీ కారే రావాలంటున్నారు అని పాటలపై మహిళలు నృత్యాలు చేశారు. గ్రామస్తులు కేసీఆర్‌ చిత్రపటాలను ప్రదర్శించి కేసీఆర్‌పై తమకున్న ప్రేమను చాటుకున్నారు.

‘ఇందిరమ్మ’ పేరిట డబ్బు వసూలు..ఒకరి అరెస్టు

ఆదిలాబాద్‌టౌన్‌: ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని చెప్పి ఓ మహిళ నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని గురువారం అరెస్టు చే సినట్లు టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. ఆ యన తెలిపిన వివరాల ప్రకారం..పట్టణానికి చెందిన ఉషాకంవార్‌ రూపకు గతేడాది ఇంది రమ్మ ఇల్లు మంజూరైంది. అయితే తానే మంజూరు చేయించానని చెప్పిన భాగ్యనగర్‌కు చెందిన మానే శంకర్‌ ఆమె నుంచి రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. డబ్బులివ్వకపోతే ఆమె పేరు తొలగించేలా చేస్తానని బెదిరించాడు. భయపడిన బాధితురాలు విడతలవారీగా రెండుసార్లు మొత్తం రూ.21 వేలు చెల్లించినట్లు తెలిపింది. అయినప్పటికీ మిగతా డబ్బుల కోసం శంకర్‌ వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement