108లో ఒకేరోజు రెండు ప్రసవాలు | - | Sakshi
Sakshi News home page

108లో ఒకేరోజు రెండు ప్రసవాలు

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

బజార్‌హత్నూర్‌: మండలంలోని గిర్నూర్‌ మహిళ సర్పంచ్‌ గర్భిణి పూసాల ప్రియాంకకు గురువారం పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108లో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తీసుకెళ్తుండగా మార్గమద్యలో పురిటినొప్పులు ఎక్కువ అయ్యాయి. పైలెట్‌ లక్ష్మణ్‌ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు. ఈఎంటీ సతీశ్‌ ఈఆర్‌సీపీ డాక్టర్‌ కసిరెడ్డిని ఫోన్‌లో సంప్రదించి డెలివరీ చేశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇచ్చోడ పీహెచ్‌సీలో వైద్యపరీక్షలు చేయగా తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అదేవిధంగా గోకొండ గ్రామానికి చెందిన గర్భిణి చందే మనీషాకు గురువారం 108లో రిమ్స్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో పురిటినొ ప్పులు ఎక్కువ అయ్యాయి. అంబులెన్స్‌ను పక్కన నిలిపి ఈఎంటీ..డెలివరీ చేయగా పండంటి ఆడబిడ్డకు జన్మించింది. రిమ్స్‌లో వైద్యపరీక్షలు చేయగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement