రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

Oct 22 2026 12:15 AM | Updated on Oct 22 2026 12:15 AM

భైంసాటౌన్‌: పట్టణంలోని సాత్‌పూల్‌ వంతెన సమీ పంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటలిజెన్స్‌ విభాగం హెడ్‌కానిస్టేబుల్‌ గడపాలే బాబు(55) మృతిచెందారు. తానూర్‌ మండలం బెంబర్‌ గ్రామానికి చెందిన బాబు విధి నిర్వహణలో భాగంగా మంగళవారం రాత్రి బైక్‌పై సాత్‌పూల్‌ వంతెన మీదుగా భోకర్‌ రోడ్డు వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఆయన బైక్‌ను ఒకదాని వెంట మరొకటి ఢీకొ న్నాయి. దీంతో బాబు కిందపడి గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు పట్టణంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హెడ్‌ కానిస్టేబుల్‌ బైక్‌ను ఢీకొన్నవారిలో ఒకరికి తీవ్రగాయాలు కాగా నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

బాబు మృతి పోలీస్‌ శాఖకు తీరని లోటు..

తానూరు : విధినిర్వహణలో మృతిచెందిన గడపాలే బాబు లేకపోవడం పోలీస్‌ శాఖకు తీరని లోటని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. బుధవారం బెంబరలో అంతక్రియలు నిర్వహించగా ఎస్పీ జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌, పోలీస్‌ సిబ్బంది ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ముధోల్‌ సీఐ రవీందర్‌, ఎస్సై షేక్‌ జుబేర్‌, పోలీస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ దండేకర్‌ సాయికుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement