నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ర్యాలీ

Oct 22 2026 12:15 AM | Updated on Oct 22 2026 12:15 AM

ఇంద్రవెల్లి: మండలంలోని హర్కపూర్‌తండా గ్రామానికి చెందిన అన్నదమ్ములు రాథోడ్‌ అరవింద్‌, ప్రవీణ్‌ మృతికి కారకులైన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. బుధవారం మండలకేంద్రంలోని అంబేడ్కర్‌ చౌక్‌ నుంచి ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఉట్నూర్‌ సీఐ మడావి ప్రసాద్‌ను కలిశారు. అన్నదమ్ముల మృతిపై కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులందరికీ అనుమానం ఉందని తెలిపారు. వారు బావిలో పడి మృతి చెందలేదని, కచ్చితంగా వారిని హత్య చేశారని ఆరోపించారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సర్పంచ్‌ రాథోడ్‌ రోహిదాస్‌, గ్రామ పెద్దలు చావన్‌ ఉమజీనాయక్‌, జాదవ్‌ దుదిరాంనాయక్‌, జాదవ్‌ ప్రహ్లాద్‌నాయక్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement