ఆదిలాబాద్‌టౌన్: డిమాండ్లు నెరవేర్చాలని జి ల్లా కేంద్రంలో దీక్ష కొనసాగిస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులు బుధవారం ఉపవాస దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. పనికి తగిన వేతనాలివ్వాలని, క్రమబద్ధీకరణపై తగి న నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దొంతుల ప్రవీణ్, ఉపాధ్యక్షులు ఈశ్వర్, సు జాత, జాయింట్ సెక్రటరీ రాజారెడ్డి, కోశాధి కారి గితేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపాల్, కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, శ్రీకాంత్, సురేశ్, విశ్వనాథ్, పూనమ్, రమణ, దత్తు, సురేందర్, అనిల్‌యాదవ్, ప్రియాంక, ఆనంద్, జ్యోతి, నవీన్, దుర్గ, శ్రీలత తదితరులున్నారు.


