కై లాస్‌నగర్: ఏళ్లుగా శిథిల భవనాలు, అద్దె ఇళ్లలో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్న ఆదిలాబా ద్ ఆర్డీవో, ఉట్నూర్, సొనాల, భోరజ్, సాత్నాల త హసీల్దార్ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఒక్కోదానికి రూ.2.25 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తూ గత జూన్ 27న జీవో జారీ చేసింది. పనులు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంకా కార్యాచరణ రూపొందించకపోవడంతో ఐదు నెలలైనా పనులు ప్రారంభం కాలేదు. నిధుల విడుదల జీవోకే పరిమితమైంది. భవన నిర్మాణానికి అవసరమైన టెండర్ల ప్రక్రి య దిశగా ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ మొ దలుకాలేదు. నిర్మాణాల విషయమై సంబంధిత అ ధికారులను ప్రశ్నిస్తే.. అసలు తమకు ఎలాంటి స మాచారం లేదంటూ చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. కాగా, నూతన భవన నిర్మాణాల కోసం నిధులు విడుదల కావడంతో తమ కష్టాలు దూరమవుతాయని ఆశపడ్డ ఆయా కార్యాలయాల ఉద్యోగులు, సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు.
అధికారుల్లో స్పష్టత కరువు
ఉట్నూర్ తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరగా, కొత్తగా ఏర్పడిన సొనాల, భోరజ్, సాత్నాల మండలాల కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలలు, మార్కెటింగ్ గోదాముల్లోని ఇరుకు గదుల్లో కొనసాగుతున్నాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బందితో పా టు వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిర్మాణాల విషయమై సంబంధిత అధికారులను సంప్రదించగా, తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని, ప్రభుత్వ పరిధిలోనే ఉందంటూ చెప్పడం గమనార్హం. కాగా, జిల్లాలోని బే ల, బజార్‌హత్నూర్, బోథ్ తదితర తహశీల్దార్ కా ర్యాలయాలూ శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూ లుతాయో తెలియకుండా ఉంది. వాటికీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి కొత్త భవనాలు నిర్మించాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.


