అమరవీరుల సేవలు మరువలేనివి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

అమరవీరుల సేవలు మరువలేనివి : కలెక్టర్‌

Oct 22 2026 12:15 AM | Updated on Oct 22 2026 12:15 AM

ఆదిలాబాద్‌టౌన్‌: పోలీసు అమరవీరుల సేవలు మ రువలేనివని కలెక్టర్‌ రాజర్షిషా కొనియాడారు. పోలీ సు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లోగల పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నివా ళులర్పించారు. జిల్లా జడ్జి ప్రభాకర్‌రావు విశిష్ట అతి థిగా, ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్‌తో పా టు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, జడ్జి హుస్సేన్‌ నాయక్‌, అదనపు ఎస్పీ మౌనిక, ఏఎస్పీ రుత్విక్‌ సాయి కొ ట్టే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష తదితరులు స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అమరజ్యోతిని వెలిగించి, సాయుధ పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. రెండు ని మిషాలు మౌనం పాటించి వీరుల త్యాగాలను స్మ రించుకున్నారు. ఈ ఏడాది విధి నిర్వహణలో ప్రా ణాలర్పించిన 154మంది పోలీసు అధికారులు, సి బ్బంది పేర్లను అదనపు ఎస్పీ చదివి వినిపించారు. అనంతరం పోలీసు అధికారులు శోక శస్త్రం ద్వారా గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అమరవీరుల కుటుంబాలకు జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చా రు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో పది రోజుల పాటు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. పోలీసు అమరవీరు ల కుటుంబాల సమస్యల పరిష్కారానికి పోలీస్‌ శా ఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంత రం అధికారులు అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. జిల్లా పరిపాలన, పోలీస్‌ యంత్రాంగం అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. రెండో బెటాలియన్‌ కమాండెంట్‌ వెంకటేశ్వరరెడ్డి, డీఎస్పీలు జీవన్‌రెడ్డి, ఇంద్రవర్ధన్‌, సీఐలు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్‌ ఎస్సైలు, రెండో బెటాలియన్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement