ఆదిలాబాద్‌టౌన్: మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు, వాహన యజమానులపై చర్యలు తీ సుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించా రు. దసరా సెలవుల సందర్భంగా రోడ్డు ప్రమాదా ల నివారణకు జిల్లా వ్యాప్తంగా వారంపాటు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 376 మంది మైనర్లు వా హనాలు నడుపుతూ పట్టుబడినట్లు తెలిపారు. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులకు మంగళవారం స్థా నిక పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 18 ఏళ్లలోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తె లిపారు. తొలిసారి పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇ చ్చి జరిమానా విధిస్తున్నామని, ఇకపై నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చే స్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఆదిలాబాద్ పోలీస్ సబ్ డి విజన్ పరిధిలో 245, ఉట్నూర్ సబ్ డివిజన్ పరిధి లో 131 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాహనాలపై విధించిన జరిమానాలు చె ల్లించిన తర్వాత వాటిని తిరిగి అప్పగిస్తామని పే ర్కొన్నారు. 18ఏళ్లు నిండినవారు తప్పనిసరిగా లైసె న్స్ పొందిన తర్వాతే వాహనాలు నడపాలని సూ చించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 26శాతం తగ్గాయని తెలిపారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఏ ఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్, పట్టణ సీఐలు సునీల్‌కుమార్, నాగరాజు, వెంకటేశ్వర్లు, రహీం పాషా, ట్రా ఫిక్ ఎస్సైలు దేవేందర్, మనీశ్ తదితరులున్నారు.


