ధర్నా విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధర్నా విజయవంతం చేయాలి

Oct 22 2026 12:15 AM | Updated on Oct 22 2026 12:15 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్‌ పిలుపునిచ్చారు. ధర్నాకు అనుమతి కోరుతూ రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని విమర్శించారు. కార్మిక వ్యతి రేక నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కార్మికులకు రెండో పీఆర్సీలో నెలకు కనీస వేతనం రూ.30వేలు నిర్ణయించాలని, రెండు డీఏలు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యల పరి ష్కారం, హక్కుల సాధనకు తలపెట్టిన ‘చలో హైదరాబాద్‌’లో రిమ్స్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆ స్పత్రుల కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్ర మంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పండుగ పొచ్చన్న, రిమ్స్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిరిగిరి దశాంత్‌, సూపర్‌ స్పెషాలిటీ అధ్యక్షుడు మోక దేవేందర్‌రెడ్డి, నాయకులు రాకేశ్‌, శేఖర్‌, వినీత్‌, మణి, స్వామి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement