సొనాల మండల కేంద్రానికి చెందిన 16మంది మిత్రులు 2019లో ఏర్పాటు చేసుకున్న మేధా గ్రూప్ ఏడేళ్లు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా వీరంతా బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం పేరిట అంతా ఒక్కచోట కలుసుకున్నారు. రోజంతా సరదాగా గడిపి ఆనందాలు పంచుకున్నారు. అనుబంధాలను మరింత పెంచుకున్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలోనూ కుటుంబ బంధాలు, మానవీయ విలువల ప్రాధాన్యతను తమ పిల్లలకు తెలియజేయడమే ఈ కలయిక ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులు తెలుపడం విశేషం. – బోథ్


