రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ

Oct 18 2026 1:54 AM | Updated on Oct 18 2026 1:54 AM

తాండూర్‌: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 16 వరకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో కె.శ్రీవల్లి ప్రతిభ కనబర్చింది. మండలంలోని అచ్చులాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని అండర్‌–17 విభాగంలో జరిగిన పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచి బ్రాంజ్‌ మెడల్‌ సాధించింది. సదరు బాలికను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, ఏఏపీసీ చైర్మన్‌ చిలకమ్మ, సర్పంచ్‌ మారిశెట్టి స్రవంతి, ఉపసర్పంచ్‌ గట్టు సంతోష్‌, వార్డు సభ్యులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement