అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం

Oct 18 2026 1:54 AM | Updated on Oct 18 2026 1:54 AM

దిలావర్‌పూర్‌: మండల కేంద్రానికి చెందిన నామాయి రుచిత జాతీయస్థాయి అండర్‌–23 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలో ప్రతిభ కనబర్చి కాంస్య పతకం సాధించింది. రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌లో ఈనెల 16 నుంచి 18 వరకు జరుగుతున్న ఆరో జాతీయ అండర్‌–23 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ తరఫున ఆమె పాల్గొంది. ఇందులో 100 మీటర్ల హాడిల్స్‌లో కాంస్య పతకం సాధించింది. 14.19 సెకన్‌లో ఈ లక్ష్యాన్ని అధిగమించి మూడో స్థానంలో నిలిచింది. ఒడిశాకు చెందిన సబితా టోప్సో 13.65 సెకన్‌లో లక్ష్యాన్ని అధిగమించి (బంగారు), తమిళనాడుకు చెందిన షిన్నీ 13. 89 సెకెన్‌లో ద్వితీయ స్థానం పొంది (రజత) పతకం సాధించింది. నామాయి రుచిత జాతీయస్థాయి పోటీల్లో గతంలో సత్తాచాటి పలు పతకాలు కై వసం చేసుకుంది. పలువురు ఆమెను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement