ఆటో బైక్‌ ఢీ.. నలుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఆటో బైక్‌ ఢీ.. నలుగురికి గాయాలు

Oct 18 2026 1:54 AM | Updated on Oct 18 2026 1:54 AM

పెంచికల్‌పేట్‌: పెంచికల్‌పేట్‌–కాగజ్‌నగర్‌ ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం ఆటో, బైక్‌ ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై అనిల్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మొట్లగూడ గ్రామానికి చెందిన యువకుడు అబ్దుల్‌ వజీర్‌ ఆటోలో పెంచికల్‌పేట్‌ నుంచి కాగజ్‌నగర్‌ వైపు, ఎల్లూర్‌ గ్రామానికి చెందిన బండి మల్లన్న బైక్‌పై కాగజ్‌నగర్‌ నుంచి పెంచికల్‌పేట్‌ వైపు వస్తున్న క్రమంలో పెంచికల్‌పేట్‌ బుడుగుల వద్ద వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్ర మాదంలో బైక్‌ ప్రయాణిస్తున్న మల్లన్నతోపాటు రా మాగౌడ్‌, ఆటో డ్రైవర్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరోబాలుడికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం కాగజ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement