నిర్మల్‌టౌన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సౌత్ జోన్ సీనియర్స్–2026 నెట్‌బాల్ పోటీలు రెండో రోజు శనివారం కొనసాగాయి. ఈ పోటీల్లో ఆరు రాష్ట్రాలకు చెందిన మహిళలు, పురుషుల జట్లు తలపడుతున్నాయి. మొత్తం 12 జట్లకు చెందిన 222 మంది క్రీడాకారులు, 15 మంది కోచ్‌లు పాల్గొంటున్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతున్నారు. ఆదివారం ఫైనల్స్ కొనసాగనున్నాయి. సౌత్ జోన్ నెట్‌బాల్ డెవలప్మెంట్ కన్వీనర్ విక్రమాదిత్యరెడ్డి, జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు భోజన్న, కార్యదర్శి శిరీష, క్రీడా సంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.


