నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం వరకు భానుడు నిప్పులు కురిపించాడు. తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై గండి రామన్న ఆలయం నుంచి సుమారు 2 కిలోమీటర్ల పరిధిలో 20 నిమిషాలు జోరు వాన కురిసింది. మిగతా ప్రాంతమంతా పొడిగా ఉంది. ఆ తర్వాత సాయంత్రం వరకు సూర్యుడు సుర్రుమన్నాడు. సాయంత్రం మరోమారు వాతావరణం మారి ఆకాశం మబ్బులు కమ్ముకుంది. మరోమారు జోరు వాన కురిసింది. దీంతో నీళ్లు రోడ్లపైకి చేరాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్
మధ్యాహ్నం విశ్వనాథ్‌పేట్ నుంచి
బస్టాండ్ వరకు కనిపించని వర్షం
జిల్లా కేంద్రంలోని బస్టాండ్ దుకాణాల
ముందు రోడ్లపై పారుతున్న వర్షం నీరు


