బెల్లంపల్లి ఆసుపత్రికి కాయకల్ప అవార్డు | - | Sakshi
Sakshi News home page

బెల్లంపల్లి ఆసుపత్రికి కాయకల్ప అవార్డు

Oct 18 2026 1:54 AM | Updated on Oct 18 2026 1:54 AM

బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రాష్ట్రస్థాయి కాయకల్ప అవార్డుకు ఎంపికై ంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఈ అవార్డు కింద ఆసుపత్రికి రూ.10 లక్షలు నగదు బహుమతి లభిస్తుంది. ఈ మేరకు తెలంగాణ కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్పేర్‌, మిషన్‌ డైరెక్టర్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి 98 మార్కులతో ప్రథమ, బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి 94.46 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచాయి. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన పరిశుభ్రత, ఇన్పెక్షన్‌ కంట్రోల్‌, బయో –మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, రోగులకు అందించిన మెరుగైన వైద్య సేవలను పరిగణలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ మెరుగైన సేవలతో రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచి అవార్డు అందుకుంది.

సూపరింటెండెంట్‌కు సత్కారం

అవార్డు అందుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్‌ను జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అభినందించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో శాలువా కప్పి సత్కరించారు.

మెరుగైన వైద్య సేవలందించాలి

లక్సెట్టిపేట: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి మాట్లాడారు. డెంగీ వ్యాధిగ్రస్తులతో మాట్లాడి ఏ ప్రాంతానికి చెందిన వారో తెలుసుకుని అక్కడ చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement