ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్–14 హ్యాండ్‌బాల్ పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా బాలికల జట్టు సత్తాచాటి స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 15 నుంచి శనివారం వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు 10 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, మహబూబ్‌నగర్ జిల్లా జట్టు 5 పాయింట్లతో ద్వితీయ స్థానాన్ని సాధించింది. ఈ పోటీల సందర్భంగా నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో జిల్లాకు చెందిన నలుగురు బాలికలు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ ఆడే రామేశ్వర్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలవడంపై డీవైఎస్ఓ దయానందరెడ్డి, డీటీఎస్ఓ పార్థసారథి, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి తదితరులు అభినందించారు.


