కై లాస్‌నగర్: ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అ న్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ శాఖ ల అధికారులతో ఎల్‌నినో యాక్షన్ ప్లాన్‌పై శనివా రం సమీక్ష నిర్వహించారు. వేసవిలో తాగునీటి స మస్య తలెత్తకుండా పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. బోరుబావులు, ఇ తర తాగునీటి వనరుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నీటి లభ్యత తగ్గే ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల పై అవగాహన కల్పించాలన్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాలులు వీచే పరిస్థితుల్లో ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. పీహెచ్‌సీల్లో అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో డీఏవో రవీందర్ సింగ్, డీపీవో రమేశ్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
ఓటరు నమోదు దరఖాస్తులు పరిష్కరించాలి
సర్ ప్రక్రియలో భాగంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, విచారణను గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శని వారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరె న్స్‌లో కలెక్టరేట్ నుంచి ఆయన పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఫారం–6, 7, 8 లకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత క్ర మంలో పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. ఓటర్ల అర్హతలను నిబంధనల ప్రకారం నిర్ధారించా లని, జాబితాలో తప్పులు, డూప్లికేట్ వివరాలు, అనర్హుల పేర్లు చేరకుండా అప్రమత్తంగా వ్యవహరించాల న్నారు. బూత్‌స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందించడంతో పాటు అవసరమైన పత్రాలు స్వీకరించాలని ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్ చిత్రు పాల్గొన్నారు.
‘సాచురేషన్’లో
వీబీ జీ–రామ్ జీ పనులు
వీబీ జీ–రామ్ జీ పథకం కింద నిర్మించనున్న పశువుల నీటి తొట్టెలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణ పనులను సాచురేషన్ విధానంలో చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో పశువుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు నీటితొట్టెల నిర్మాణం, గ్రామాల్లోని వాటర్ ప్లాంట్ల వద్ద కమ్యూనిటీ ఇంకుడు గుంతల ఏర్పాటు కోసం అవసరమైన పనులను క్షేత్రస్థాయిలో గుర్తించాలని పేర్కొన్నారు. నిర్మాణ పనులు సైతం త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెటర్నరీ శాఖ అందించిన జాబితాలోని గ్రామాలకే పరిమితం కాకుండా, ఆయా మండలాల పరిధిలో పశువుల నీటి తొట్టెలు అవసరమైన ఇతర గ్రామాలను కూడా గుర్తించి, సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అనుమతులు పొందాక నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.


