కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీకి చెందిన అధికార పార్టీ కౌన్సిలర్లు శుక్రవారం రాత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్, మాజీ ఎంపీ బాపూరావు, మాజీ ఎమ్మెల్యే సక్కు ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్రభారతిలో కలిసి పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ఆదిలాబాద్ పట్టణా భివృద్ధి కోసం రూ.30కోట్ల నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 500 ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేకంగా మంజూరు చేయాలని విన్నవించారు. ఈమేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా వారు పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సంజయ్, కౌన్సిలర్లు సాయిచరణ్గౌడ్ తదితరులున్నారు.


