ఆదిలాబాద్రూరల్: ఎయిర్పోర్టు కోసం భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు రూపంలో అందజేయాలని అదనపు కలెక్టర్లు ఆర్ఎస్ చిత్రు, రాజేశ్వర్ అన్నారు. మండలంలోని అనుకుంట గ్రామంలో నిర్వాసితులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, ఏవైనా పొరపా ట్లు, అభ్యంతరాలు ఉంటే దృష్టికి తీసుకురావా లని, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామన్నారు. వారి వెంట ఆర్డీవో జగదీశ్వర్రావు, తహసీల్దార్ గోవింద్, ఆర్ఐ నారాయణ తదితరులున్నారు.


