కై లాస్నగర్: ఔట్సోర్సింగ్ ఉద్యోగా ల కోసం నూతన ఎంప్యానెల్ కమిటీ ఏర్పాటు చేసి, ని యామకాల్లో ఉమ్మ డి జిల్లా వాసులకు ప్రాధాన్యత కల్పించాలని టీపీసీసీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ కోరారు. శుక్రవారం రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశా రు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల ఎంప్యానెల్ కోసం నూతనంగా టెండర్లు పిలిచి కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఈమేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా ఆయన తెలిపారు.


