గుడిహత్నూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి పాటించాల ని ఐటీడీఏ పీవో మంద మకరందు అధికా రులను ఆదేశించారు. మండలంలో చెరుకువాయి కొలాంగూడలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల పనుల ను శుక్రవారం పరిశీలించారు. వినియోగిస్తున్న సామగ్రి, పనుల పురోగతిపై ఆరా తీశారు. పే దల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం తగదని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురా వాలని అధికారులకు సూచించారు. ఇళ్లు లేని మరో మూడు కుటుంబాలకు మంజూరు చేశా రు. తమ గూడేనికి సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆదివాసీలు పీవో దృష్టికి తీ సుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించా రు. ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ కవి తారెడ్డి, ఇతర శాఖల అధికారులున్నారు.


