రిమ్స్‌లో కొందరు కార్మికుల తీరిదీ కేటాయించిన డ్యూటీ కాకుండా వేరే పనుల్లో.. కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతరు రోగులకు తప్పని తిప్పలు
ఆదిలాబాద్‌టౌన్: కేటాయించిన పనులు కాదు.. మాకు నచ్చిన చోటే పనిచేస్తాం.. ఇది రిమ్స్‌లోని కొంతమంది కార్మికుల తీరు. ఇటీవల కలెక్టర్ రాజ ర్షిషా రిమ్స్ అధికారులు, కార్మికులతో సమీక్షించా రు. నియామకమైన పోస్టుల్లోనే పనిచేయాలని ఆదేశించారు. అయితే కొందరిలో మాత్రం మార్పు కానరావడం లేదు. ఇప్పటికీ ఇతర విభాగాల్లోనే పనిచేస్తున్నారు. కేటాయించిన విధులను విస్మరిస్తున్నా రు. ఫలితంగా రోగులకు తిప్పలు తప్పడం లే దు. రాజకీయ నాయకులు, తెలిసిన వారితో అధికా రులకు ఫోన్ చేయించి ఒత్తిడి తెస్తున్నారు. వారికి పారి శుధ్య పనులు, సెక్యూరిటీ గార్డు, పేషెంట్‌కేర్ పనులు చెప్పకుండా చూస్తున్నారు. అయితే ఔట్సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్టర్లు నియామకమైన పో స్టుల్లో పనిచేయని వారికి హాజరు వేయడం లేదు. జీతాల్లో కోతలు విధిస్తామని చెప్పడంతో సగం మందికి పైగా ఇటీవల విధుల్లో చేరగా, మరి కొందరు ఇంకా నచ్చిన పనుల్లోనే కొనసాగుతున్నారు.
పారిశుధ్య పనులపై ప్రభావం..
కార్మికులకు కేటాయించిన విధులు నిర్వహించకపోవడంతో రిమ్స్‌లో పారిశుధ్యంపై ప్రభావం చూపుతోంది. పలు వార్డులు కంపు కొడుతున్నాయి. ఆస్పత్రి ఆవరణ చెత్తాచెదారంతో దర్శనమిస్తోంది. అలా గే పేషెంట్కేర్గా పనిచేయాల్సిన వారు వేరేపనుల్లో నిమగ్నమవ్వడంతో రోగుల బంధువులే స్ట్రెచ్చ ర్ల ద్వారా తీసుకెళ్లాల్సిన దుస్థితి.మరికొందరు సెక్యూరిటీ గార్డులు కేటాయించినా డ్యూటీ చేయకపోవడంతో రోగుల బంధువులు ఇష్టారీతిన వార్డులకు వెళ్లి వస్తున్నారు. దీంతో వైద్యులు రోగులను పరీక్షించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రిమ్స్‌లో పనిచేస్తున్న కొంత మంది కార్మికులు కేటాయించిన విధులు కాకుండా ఇతర పనులు చేస్తున్నారు. ఇటీవల కలెక్టర్ ఆదేశాల మేరకు ఇతర పనుల్లో ఉన్న 65 మంది వారికి కేటాయించిన డ్యూటీలో చేరగా మరో 35 మంది ఎవరు చెప్పినా వినడం లేదు. మూడు రోజుల క్రితం ఓ పేషేంట్ కేర్ తనను ఇతర పనుల్లో కొనసాగించేలా ఓ రాజకీయ నాయకుడితో పైరవీ చేయించారు. హాజరు వేయకపోవడంతో ఆమె సూపర్వైజర్తో వాగ్వాదానికి దిగడం గమనార్హం.


