కై లాస్‌నగర్: జిల్లాకేంద్రంలో శుక్రవారం రాత్రి అధికారికంగా నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. వేడుకలకు కలెక్టర్ కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళా ఉద్యోగులు ఉయ్యాల పాటల నడుమ బతుకమ్మ ఆడి సందడి చేశారు. వారితో కలిసి అధికారులు స్టెప్పులేశారు. ఇందులో అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, డీఆర్వో స్రవంతి, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మెప్మా పీడీ సీవీఎన్. రాజు, ప్రభుత్వ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.మనోహర్, డీఈఓ మాధవి, డీడబ్ల్యూవో మిల్కా, కౌన్సిలర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్‌లో..
ఉట్నూర్‌రూరల్: మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఐక్య కూటమి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళా ఉద్యోగులు, కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కూటమి నాయకులు అంజత్ మిర్జాబేగ్, సిబ్బంది పాల్గొన్నారు.


