కై లాస్‌నగర్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రి య వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నా రు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం ఆది లాబాద్ పట్టణం న్యూహౌసింగ్‌బోర్డు కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద గల వివి ధ పోలింగ్‌కేంద్రాలను సందర్శించారు. ఓటర్ల జాబి తాను పరిశీలించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సూపర్‌వైజర్, బూత్‌స్థాయి అధి కారులతో ఓటర్ల జాబితాలో మార్పులు, మ్యాపింగ్ ప్రక్రియపై ప్రత్యేకంగా చర్చించారు. పలువురు ఓట ర్లకు ఫారం–6లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో షిఫ్టెడ్, డెత్, డబుల్ ఎంట్రీ ఓటర్ల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్దేశిత పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల వివరాలు సరిపోల్చుతూ, తొలగించాల్సిన ఓట్లు, మృతి చెందినవారి ఓట్లు, డబుల్ ఓట్ల జాబితాను పకడ్బందీగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేలా పారదర్శకతతో ప్రక్రియను విజ యవంతం చేయాలని స్పష్టం చేశారు. ఇందులో తహసీల్దార్ వేణు, జీపీవో శ్రీధర్, బీఎల్‌వోలు మంజుల, కావేరి, గంగన్న తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, కేజీబీవీలు, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులపై ఇంజినీరింగ్ అధికారులతో శుక్రవారం సమీ క్షించారు. జైనథ్, బోథ్, ఉట్నూర్‌లోని యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాల పురోగతి, కేజీబీవీలు, ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న పనుల స్థితిగతులపై ఆరా తీశారు. వేగవంతం చేయాలని ఆదేశించారు. కేజీబీవీల్లో నాబార్డు నిధులతో చేపట్టిన పనులతో పాటు ప్రహరీ నిర్మాణాలు, సమగ్ర శిక్షా అభియాన్‌లో మంజూరైన ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఇందులో టీజీఈడబ్ల్యూఐడీసీ ఇన్‌చార్జి ఎస్‌ఈ రవీందర్, డీఈ జ్ఞానేశ్వర్ అధికారులు, సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.


