రూ.2.48 లక్షల ఆస్తిపన్ను చెల్లింపు | - | Sakshi
Sakshi News home page

రూ.2.48 లక్షల ఆస్తిపన్ను చెల్లింపు

Oct 16 2026 7:47 AM | Updated on Oct 16 2026 7:47 AM

కై లాస్‌నగర్‌: కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఓ హోటల్‌కు సంబంధించిన ఆస్తి పన్ను ఎట్టకేలకు వసూలైంది. ‘మున్సిపల్‌ అధికారులకు వింత అనుభవం’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పట్టణ ంలోని అంబేడ్కర్‌చౌక్‌ సమీపంలోని ఆ హోటల్‌ యాజమాని స్పందించారు. గతంలో పలుమార్లు పన్ను వసూలు కోసం వెళ్లిన బల్దియా రెవెన్యూ సిబ్బందికి చెల్లించకుండా మొండికేసిన సదరు యజమాని సాక్షి కథనంతో కదిలారు. ఏకంగా బల్దియా సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించి మరీ పెండింగ్‌లో ఉన్న రూ.2.48, 220 ఆస్తిపన్ను పూర్తిగా చెల్లించేశారు. దీంతో మున్సిపల్‌ అధికారులు, ఉద్యోగులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఇది వరకు ఇక్కడ పనిచేసి ప్రస్తుతం ఇతర జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అధికారి వ్యవహారంపై కా ర్యాలయంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బది లీ అయినా ఇంకా ఇక్కడ పెత్తనం చెలాయించడమేంటనే విమర్శలు వ్యక్తమయ్యాయి. సదరు అధి కారి వైఖరిని వివరిస్తూ ప్రచురితమైన సాక్షి కథనంపైన సర్వత్రా చర్చ జరిగింది. రాజకీయ, అధికార, ఇంటలిజెన్స్‌ వర్గాలు ఆ అధికారి ఎవరనే దానిపై ఆసక్తిగా ఆరా తీశా యి. జిల్లా స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ ఎస్‌. రాజేశ్వర్‌ ఈ విషయంలో మున్సి పల్‌ అధికారులతో మాట్లాడి ఆరా తీసినట్లుగా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement