ఆన్‌లైన్‌లో ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌

Oct 16 2026 7:47 AM | Updated on Oct 16 2026 7:47 AM

● క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌ జేడీ వెంకటరమణ

నిర్మల్‌చైన్‌గేట్‌: ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌ తెలంగాణ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. నిర్మల్‌ కలెక్టరేట్‌లో గురువారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌లో పారదర్శకత పెంపొందించడంతో పాటు దరఖాస్తుల పరిశీలన, ప్రక్రియ వేగవంతం, సులభతరం చేసేందుకే నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఆస్పత్రుల నిర్వాహకులు రిజిస్ట్రేషన్‌ కోసం ప్రభుత్వం నిర్దేశించిన వెబ్‌పోర్టల్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా అవసరమైన వివరాలు, ధ్రువపత్రాలను సమర్పించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సీఈఏ అధికారి సునీల్‌ రాజ్‌ మాట్లాడుతూ పోర్టల్‌లో దరఖాస్తుల నమోదు, పత్రాల అప్‌లోడ్‌, పరిశీలన అంశాలపై అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అవగాహన కల్పించారు. సమావేశంలో నిర్మల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేందర్‌, ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సాధన, నిజామాబాద్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement