పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

Oct 16 2026 7:11 AM | Updated on Oct 16 2026 7:11 AM

ఆదిలాబాద్‌(బేల): సోయా పంట ఆశించిన దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బేల ఎస్సై మధుకృష్ణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బేల మండలం సిరసన్న గ్రామానికి చెందిన ఉరాడే అవినాశ్‌(40) నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సోయా పంట సాగు చేశాడు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో ఆవేదనకు గురయ్యాడు. బుధవారం మధ్యాహ్నం 12గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన అవినాశ్‌ ఒంటి గంటకు తిరిగి వచ్చాడు. వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా, పంట దిగుబడి సరిగా రాకపోవడంతో పురుగుల మందు తాగినట్లు తెలిపాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 2.30గంటలకు మృతిచెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement