కలెక్టరేట్‌ ఎదుట టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ధర్నా | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ధర్నా

Oct 2 2026 11:56 PM | Updated on Oct 2 2026 11:56 PM

కై లాస్‌నగర్‌: గాంధీ జయంతి పురస్కరించుకుని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో వర్కింగ్‌ జర్నలిస్టుల డిమాండ్ల దినంగా పాటించారు. యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూని యన్‌ అధ్యక్ష కార్యదర్శులు మాదాస్తు రాజేశ్వర్‌, నూకల దేవేందర్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన విధంగా హెల్త్‌ కార్డులు ఇచ్చి క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్‌, రఘు జోషి, వినోద్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement