వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

Oct 2 2026 11:56 PM | Updated on Oct 2 2026 11:56 PM

ఆదిలాబాద్‌టౌన్‌: వన్యప్రాణుల సంరక్షణ మ నందరి బాధ్యత అని ఎఫ్‌డీవో ప్రతమేష్‌ కిశోర్‌ తిజారే అన్నారు. జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు పురస్కరించుకుని అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 2 నుంచి 8వరకు నిర్వహించే వారోత్సవా ల్లో భాగంగా డివిజన్‌ కార్యాలయంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. వన్యప్రాణుల సంరక్షణ, అట వీ సంపద పరిరక్షణ, జీవవైవిధ్యం ప్రా ధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. వన్యప్రాణులు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఎఫ్‌ఆర్‌వో అవినాష్‌ రాథోడ్‌, ఉట్నూర్‌ ఎఫ్‌ఆర్‌వో శీలానంద్‌, బేల ఎఫ్‌ఆర్‌వో అనిత, ఆదిలాబాద్‌, బేల, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌ రేంజ్‌లకు చెందిన అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement