రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి

Oct 2 2026 11:56 PM | Updated on Oct 2 2026 11:56 PM

ఆదిలాబాద్‌: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటేలా నిరంతరం సాధన చేయాలని డీవైఎస్‌వో దయానంద్‌రెడ్డి అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో జోనల్‌స్థాయి స్విమ్మింగ్‌, జిల్లాస్థాయి బేస్‌ బాల్‌, చెస్‌, క్రికెట్‌ ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే భవి ష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ రామేశ్వర్‌, పీడీలు ఎన్‌.స్వామి, కాంతారావు, హరిచరణ్‌, నాందేవ్‌, సాయికుమార్‌, కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాష్ట్రపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement