హాస్టల్‌ వివాదంపై సమగ్ర విచారణ | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ వివాదంపై సమగ్ర విచారణ

Sep 10 2026 12:15 AM | Updated on Sep 10 2026 12:15 AM

వార్డెన్‌కు మెమో జారీ

చింతూరు: స్థానిక ఎస్సీ హాస్టల్‌ వార్డెన్‌ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమగ్రంగా విచారణ నిర్వహిస్తున్నట్లు సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ ఎంవీఎన్‌ మూర్తి బుధవారం ప్రకటనలో తెలిపారు. వార్డెన్‌ తాతాజీపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిపై పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఆరోపణల నేపథకచంలో హాస్టల్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు ఆరోపణలు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులను కలసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రాథమిక చర్యల్లో భాగంగా ఇప్పటికే సదరు వార్డెన్‌కు మెమో జారీ చేశాయపి, పూర్తిస్థాయి విచారణ నిమిత్తం ఆరోపణలు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీడీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం మరోమారు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్‌ను కలసి వార్డెన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement